ఈ రోజు నాకు ఎందుకో చాలా హాయి గా ఉంది.  రోజూ ఒక పాఠం అని తెలుసు కానీ అనుభవాలు నేర్పే పాఠం అని అర్ధం చేసుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది.  ఎప్పుడైనా ఎవరైనా మన గురించి మాట్లాడితే మనల్ని మన అభిప్రాయాల్ని ఖండిస్తున్నారు అని అనుకోవటం కంటే మన కోసం ఆలోచించి మాట్లాడుతున్నారు అని అనుకోవటం మంచిది.  ఎవరు యెంత చెప్పినా వినిపించుకోని నాకు ప్రేమ విలువ మాత్రం "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమా చూడగానే అనిపించింది.  ఓర్పు మనిషిని తయారు చేస్తుంది అని. 
   ఎవరినైనా ఎదిరించి ధైర్యం గా ఒక నిర్ణయం తీసుకోవటానికి అంత కంటే ఎక్కువ ధైర్యం కావాలి. సాహసం చెయ్యాలి.  అప్పుడే ఏవైనా సాధిస్తాం అని అర్ధం అయ్యింది.  కానీ ఒకరిని పంచన ఉంటూ వారికి ఇష్టం లేని మనకి అనువైన నిర్ణయం తీసుకోవటానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత నమ్మకం కావాలి ఎంత చాకచక్యం కావాలి అమ్మో నాకు చాలా కష్టం అనిపిస్తోంది కానీ ఎందుకో గర్వం గా మాత్రం ఉంది.
ఇది మొత్తం నా పెర్సనల్ డైరీ ఆన్ లైన్ లో.. గూగుల్ వారికి నా ధన్యవాదాలు.
చల్ల గా ఉండండి.  ఈ సౌకర్యం కల్పించినందుకు.
Wednesday, March 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
 
 
No comments:
Post a Comment